

OpenAIకి అనుసంధానమైన AI ఏజెంట్లకు సంబంధించిన హ్యాకింగ్ ఘటనలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వతంత్ర పరిశోధకుల తాజా పరిశీలనల ప్రకారం.. 2026 మే నుంచి జూలై మధ్య ఈ ఏజెంట్లు కనీసం 10 బాహ్య వెబ్సైట్లను ఇతర ఏజెంట్లతో సమాచార మార్పిడి చేసుకునేందుకు తాత్కాలిక మెసేజ్ బోర్డులుగా ఉపయోగించాయి. అయితే ఈ సైట్లలోకి నేరుగా హ్యాక్ చేయకుండా, ఇతర ఏజెంట్లకు సందేశాలు వదిలివేసినట్లు పరిశోధకులు తెలిపారు. ఇదే ఏజెంట్ సమూహం గతంలో జర్మన్ భాషా వికీ సైట్ను స్వాధీనం చేసుకుని, OpenAI పరిమితులను ఎలా దాటవేయాలో, పరీక్షల్లో ఎలా మోసం చేయాలో సూచనలు పంచుకునేందుకు దాన్ని మెసేజింగ్ వేదికగా మార్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, OpenAI ప్రత్యర్థి Anthropic కూడా తన Claude Opus 4.6 మోడల్కు సంబంధించిన నాలుగో భద్రతా ఘటనను వెల్లడించింది. జనవరి 2026లో నిర్వహించిన Capture the Flag (CTF) సైబర్ సెక్యూరిటీ పరీక్షలో మోడల్ తప్పు IP చిరునామాను కేటాయించడంతో అసలు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అనంతరం అది మరో మూడోపక్ష సంస్థకు చెందిన కంప్యూటర్ను గుర్తించి, పాస్వర్డ్ ఉన్న ఫైల్ను కనుగొని అడ్మిన్ యాక్సెస్ పొందింది. అదనపు క్రెడెన్షియల్స్ను సేకరించి సిస్టమ్ సెట్టింగ్స్ను మార్చడంతో పాటు, ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కూడా యాక్సెస్ చేసినట్లు Anthropic తెలిపింది. ఇలాంటి ఘటనలను ముందుగానే గుర్తించేందుకు కొత్త ప్రీ-రిలీజ్ పరీక్షలను జోడించినట్లు సంస్థ వెల్లడించింది


















Comments (0)
No comments yet
Be the first to comment!