Wednesday, 28 October 2026
About UsContact UsPrivacy Policy
Tea Time TeluguAd
GeneralPoliticsMoviesGossipsReviewsGalleryVideosShowsOTTSportsBusinessTechnologyHealth
తెలుగు
Login
logo
GeneralPoliticsMoviesGossipsReviewsGalleryVideosShowsOTTSportsBusinessTechnologyHealthPollsBookings
తెలుగు
Tea Time Telugu logo
About UsReferral GuideContact UsAdvertise With UsFeature RequestPrivacy Policy

Copyright © 2026 All Rights Reserved by Eagle Eye Technologies .

Revanth Reddy Reviews Preparations for Invest Telangana Global Summit

Writer: Nithish02:22 AM, 28 October 2026
Revanth Reddy Reviews Preparations for Invest Telangana Global Summit

డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ నెల 29న ఢిల్లీలో జరగనున్న ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నవంబర్ మొదటి వారంలోగా సమ్మిట్‌కు సంబంధించిన ప్రణాళికలను ఖరారు చేసి, వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సంస్థల అధిపతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిసెంబర్ 7 నుంచి ఫ్యూచర్ సిటీలో జరిగే సదస్సుతో పాటు పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ప్రదర్శన, ఇండియా జాయ్ కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

సాంకేతికత, ఔషధ తయారీ, అంతరిక్ష-విమానయాన రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను అంతర్జాతీయ అతిథులకు పరిచయం చేసేలా హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ప్రచారం నిర్వహించాలని, వాతావరణ మార్పులు, కృత్రిమ మేధ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించాలని ఆదేశించారు. యానిమేషన్, దృశ్య ప్రభావాలు, ఆటల రూపకల్పన, కామిక్స్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు వివరించారు. సదస్సు ప్రాంగణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ నమూనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. బతుకమ్మ పండుగ ప్రత్యేకతను అతిథులకు పరిచయం చేసేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ డి. అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

What's your reaction? 0 votes

AdvertisementAdvertisement
Loading comments...
Suggested Posts
Harsh Goenka Highlights ISRO Chairman’s Salary.. Sparks Debate on Scientists’ Pay

KTR Strongly Criticises Revanth Reddy Government for Telangana’s Drought

Telangana Government Takes Key Decision on Drought Conditions

Nine FIRs Registered in a Single Day During AP Local Elections

Jan Suraaj Party Manager Found Dead Near Railway Tracks in Jharkhand

Tags
Invest TelanganaGlobal SummitRevanth ReddyFuture CityTelangana investmentsglobal investorsRaksha ExpoIndia JoyTelangana cultureBathukamma festival
AdvertisementAdvertisement
Follow Us
FacebookInstagram
Telangana Invites Leading Global Companies for Invest Telangana Summit

YouTube
X
WhatsApp
Loading latest stories...
Latest Stories
Bigg Boss Telugu Season 10 Day 51: Heated Nominations, Housemates Slam Mukesh Goud’s Behaviour
Shows

Apple Unveils New iMac M6, Check the Price and Key Features
Technology

Apple Unveils New iMac M6, Check the Price and Key Features

Shreyas Iyer Praises the Openers’ Batting
Sports

Shreyas Iyer Praises the Openers’ Batting

Revanth Reddy Reviews Preparations for Invest Telangana Global Summit
General

Revanth Reddy Reviews Preparations for Invest Telangana Global Summit

Harsh Goenka Highlights ISRO Chairman’s Salary.. Sparks Debate on Scientists’ Pay
General

Harsh Goenka Highlights ISRO Chairman’s Salary.. Sparks Debate on Scientists’ Pay

KTR Strongly Criticises Revanth Reddy Government for Telangana’s Drought
General

KTR Strongly Criticises Revanth Reddy Government for Telangana’s Drought

Telangana Government Takes Key Decision on Drought Conditions
General

Telangana Government Takes Key Decision on Drought Conditions

Kiran Abbavaram’s ‘Reality’ Audio Rights Reportedly Fetch a Big Deal
Movies

CSK Video’s Jersey Number Clue Sparks Buzz Around Hardik Pandya

Buzz Surrounds Nagarjuna’s ‘King 100’ OTT Deal
Movies

Buzz Surrounds Nagarjuna’s ‘King 100’ OTT Deal

Nine FIRs Registered in a Single Day During AP Local Elections
General

Nine FIRs Registered in a Single Day During AP Local Elections

Jan Suraaj Party Manager Found Dead Near Railway Tracks in Jharkhand
General

Jan Suraaj Party Manager Found Dead Near Railway Tracks in Jharkhand

Comments (0)

No comments yet

Be the first to comment!