

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్లో ప్రీమియర్ ప్రీ సేల్స్ దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే ప్రీ సేల్స్ $1 మిలియన్ మార్క్ను దాటగా.. తాజాగా $1.1 మిలియన్ను కూడా అధిగమించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. దీంతో విడుదలకు ముందే సినిమాపై ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమవుతోంది.
శ్రీకాంత్ ఓదెలను తదుపరి తరం ప్రముఖ దర్శకుడిగా పరిశ్రమలో పలువురు అభివర్ణిస్తున్న నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’పై అంచనాలు మరింత పెరిగాయి. నాని గత చిత్రాలకు ఉన్న మార్కెట్, శ్రీకాంత్ ఓదెల కథను తెరకెక్కించిన విధానంపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి ప్రీ సేల్స్పై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. విదేశీ మార్కెట్లో ఈ స్థాయి స్పందన చిత్ర బృందంలో ఉత్సాహాన్ని పెంచుతోంది. సినిమా విడుదల తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.













Comments (0)
No comments yet
Be the first to comment!