

రతికా రోజ్‌కు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా మంచి గుర్తింపు లభించింది. హౌస్‌లో ఆమె ఆటతీరు, తోటి కంటెస్టెంట్లతో జరిగిన వివాదాలు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల్లో చర్చకు దారితీశాయి. ఈ షో ద్వారా పాపులారిటీ పెరిగినప్పటికీ, ఆమె ప్రవర్తనపై విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదురయ్యాయి. దీంతో నాలుగు వారాలకే ఆమె షో నుంచి ఎలిమినేట్ అయింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన రతికా రోజ్ ఓ రైతు కుటుంబంలో జన్మించింది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ఆమెకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, క్రమంగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది.
రతికా రోజ్ 2020లో విడుదలైన ‘బొమ్మ అదిరింది’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో షకలక శంకర్ సరసన కథానాయికగా నటించింది. అనంతరం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘నేను స్టూడెంట్ సర్!’ సినిమాలో మహిళా పోలీసు అధికారిగా కీలక పాత్ర పోషించింది. బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండీ దుస్తులు, గ్లామరస్ ఫొటోషూట్లు, కొత్త లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, పోస్టులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రతికా రోజ్ ఎలాంటి కొత్త సినిమాలు, వినోద కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.



















Comments (0)
No comments yet
Be the first to comment!